Flying Objects | ఏలియన్స్ కావొచ్చేమో : అమెరికా జనరల్
Aliens: అమెరికా గగనతలంలో వరుసగా గుర్తు తెలియని ఆబ్జెక్ట్స్‌ను వైమానిక దళం కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే అవి ఏలియన్స్ అయి ఉండవచ్చు అని అనుమానాలను కొట్టిపారేయలేమని జనరల్ గ్లెన్ వాన్హెర్క్ తెలిపారు.
కాలిఫోర్నియా: అమెరికా గగనతలంపై ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువుల్ని ఆ దేశం కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా నాలుగవ ఆబ్జెక్ట్‌ను కూడా అమెరికా కూల్చింది. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా వైమానిక క్షేత్రంలో కనిపిస్తున్న ఆ ఆబ్జెక్ట్స్ ఏలియన్స్ అయి ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ అనుమానాలను కొట్టిపారేయలేమని అమెరికా ఎయిర్ ఫోర్స్ జనరల్ గ్లెన్ వాన్హెర్క్ తెలిపారు. ఉత్తర అమెరికా వైమానిక దళానికి చీఫ్‌గా ఉన్న ఆయన ఓ ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు.
గ్రహాంతరవాసులు అవునో కాదో చెప్పలేనని, కానీ ఆ అనుమానాలను తీసిపారేయలేమని జనరల్ గ్లెన్ తెలిపారు. అంతర్జాతీయ సమాజంతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆ విషయాన్ని తేల్చాలన్నారు. తాను మాత్రం వ్యక్తిగతం ఆ విషయాన్ని కొట్టిపారేయలేనన్నారు. ఆదివాంర పెంటాన్లో జరిగిన బ్రీఫింగ్ సమయంలో వాన్హెర్క్ ఈ విషయాన్ని తెలిపారు. ఆదివారం కూడా అష్టాకారంలో ఉన్న ఓ గుర్తుతెలియని వస్తువును అమెరికా ఎఫ్-16 ఫైటర్ విమానాలు కూల్చివేశాయి.
కెనడా బోర్డర్ సమీపంలో ఉన్న లేక్ హూరన్ వద్ద నాలుగో ఆబ్జెక్ట్‌ను అమెరికా వైమానిక దళాలు కూల్చివేశాయి. 20 వేల ఫీట్ల ఎత్తులో ఎగురుతున్న ఆబ్జెక్ట్‌ను పేల్చినట్లు పెంటగాన్ తెలిపింది.ఫిబ్రవరి 4వ తేదీన చైనాకు చెందిన బెలూన్ను కూల్చిన తర్వాత వరుసగా గుర్తుతెలియని వస్తువులు అమెరికా గగనతలాన్ని చుట్టేస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

