Ali Bagheri : ఇరాన్‌కు చెందిన ప్రముఖ అణు సంధానకర్త (Nuclear negotiator) అలీ బఘేరిని ఆ దేశ విదేశాంగ మంత్రిగా నియమించారు. విదేశాంగ శాఖకు శాశ్వత మంత్రిని నియమించే వరకు ఆయన యాక్టింగ్ మంత్రిగా వ్యహరించనున్నారు. ఈ మేరకు ఇరాన్ సర్కారు అధికారిక మీడియా ద్వారా ఒక ప్రకటన చేసింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిర్ అబ్దొల్లాహైన్.. అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీతోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తాత్కాలికంగా అలీ బఘేరిని ఆ పదవిలో నియమించారు. ఇన్నాళ్లు అమిర్ అబ్దొల్లాహైన్ కింద విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించిన అలీ బఘేరిని యాక్టింగ్ విదేశాంగ మంత్రిగా నియమిస్తున్నామని ఇరాన్ ప్రభుత్వ ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి జహ్రోమి మీడియాకు వెల్లడించారు.