ఒక మహిళ.. 2 గర్భాశయాలు.. కవలలు
ఒక మహిళకు రెండు గర్భాశయాలు ఉండటమే అరుదు. కొన్ని కోట్లమందిలో ఒక మహిళకు ఇలాంటి అరుదైన పరిస్థితి ఉంటుంది. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ రెండు గర్భాశయాల ద్వారా రెండు వేర్వేరు రోజుల్లో కవలలకు జన్మనిచ్చింది. ఇది అత్యంత అరుదైన ఘటన అని వైద్యులు తెలిపారు.
అలబామా, డిసెంబర్ 23: ఒక మహిళకు రెండు గర్భాశయాలు ఉండటమే అరుదు. కొన్ని కోట్లమందిలో ఒక మహిళకు ఇలాంటి అరుదైన పరిస్థితి ఉంటుంది. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ రెండు గర్భాశయాల ద్వారా రెండు వేర్వేరు రోజుల్లో కవలలకు జన్మనిచ్చింది. ఇది అత్యంత అరుదైన ఘటన అని వైద్యులు తెలిపారు. అలబామా రాష్ర్టానికి చెందిన కెల్సే హేచర్ (32) రెండు గర్భాశయాల ద్వారా డిసెంబర్ 19న ఉదయం ఒకరికి, డిసెంబర్ 20న ఉదయం మరొకరికి జన్మనిచ్చినట్టు వైద్యులు వెల్లడించారు.
ఇద్దరూ ఆడశిశువులే కావటం, వారి ఇంట క్రిస్మస్ పండుగ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసింది. హేచర్ రెండు రోజుల వ్యవధిలో రెండు గర్భాశయాల ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనివ్వటంపై వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాలు 5 కోట్ల మందిలో ఒకరికి జరుగుతూ ఉంటాయని ఆమెకు పురుడు పోసిన గైనకాలజిస్ట్ శ్వేతా పటేల్ తెలిపారు. రెండు గర్భాశయాలున్నా.. జననాలు సక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అయితే ఈ కేసులో ఇద్దరూ ఆరోగ్యంగా పుట్టారని వైద్యులు చెప్పారు. తనకు రెండు గర్భాశయాలు ఉన్నాయన్న సంగతి కెల్సే హాచర్కు 17వ ఏట తెలిసిందట. 2019లో బంగ్లాదేశ్‌లోనూ ఓ మహిళ ఇలాగే 26 రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని వైద్యులు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

