Alok Sharma | భారత సంతతి వ్యక్తికి నైట్‌హుడ్ అవార్డు.. పర్యావరణ పరిరక్షణ కృషికి గుర్తింపు
గ్లాస్గో నగరంలో జరిగిన కాప్ 26 సదస్సుకు అలోక్ అధ్యక్షుడిగా వ్యవహరించారు
Alok Sharma : బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మకు అరుదైన గౌరవం లభించనుంది. ఆయన బ్రిటన్ రాజు చేతుల మీదుగా నైట్‌హుడ్ అవార్డు అందుకోనున్నారు. కొత్త సంవత్సరం రోజున బ్రిటన్ రాజు చార్లెస్ 3 గౌరవించే వ్యక్తుల జాబితాలో భారత సంతతికి చెందిన ఈయనకు చోటు దక్కింది. పర్యావరణ పరిరిక్షణ కోసం చేసిన కృషికి గుర్తింపుగా అలోక్‌కు ఈ గౌరవం దక్కింది. ఈ ఏడాది బ్రిటన్‌లో జరిగిన కాప్ 26 సదస్సుకు అలోక్ అధ్యక్షుడిగా ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలతో బ్రిటన్ ఒక ఒప్పందానికి అంగీకరించడంలో అలోక్ కీలకంగా వ్యవహరించారు. ఇది నిజంగా గొప్ప ప్రభావం చూపనుంది అని బ్రిటన్ విదేశీ, కామన్వెల్త్, డెవలప్మెంట్ ఆధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్లాస్గో నగరంలో ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 12 వరకు కాప్ 26 సదస్సు జరిగింది.
ప్రజా సేవలో విశిష్ట కృషి చేసిన 1,100 మందిని కొత్త ఏడాదిలో బ్రిటన్ రాజు గౌరవించనున్నారు. వీళ్లలో బ్రిటన్ మాజీ రాణి, దివంగత ఎలిజబెత్ 2 గిటారిస్ట్ బ్రయాన్ మే కూడా ఉన్నాడు. ఈ జాబితాలో ఉన్న విదేశాలకు చెందిన 30 మందిలో అలోక్ శర్మ ఒకరు. ఈ 30 మందిలో పర్యావరణ కార్యకర్తలు, విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, వైద్యులు, సమాజ సేవకులు ఉన్నారు. అలోక్ శర్మ ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాలో 1967 జన్మించారు. 5 ఏళ్ల తర్వాత ఆయన తల్లిదండ్రులు లండన్‌లోని రీడింగ్ నగరానికి వలస వెళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

