TALIBAN| నెక్టైలపై నిషేధం విధించనున్న తాలిబన్లు.. కారణమిదే!
కాబూల్: అఫ్గానిస్థాన్‌లో బ్యూటీ పార్లర్లు, సెలూన్లపై ఇప్పటికే నిషేధం విధించిన తాలిబన్లు.. ఇప్పుడు నెక్టైలపై నిషేధం విధించేందుకు సిద్ధమయ్యారు. నెక్‌టైలు క్రైస్తవ శిలువను పోలి ఉండటమే ఇందుకు కారణం!
TALIBAN| కాబూల్: అఫ్గానిస్థాన్‌లో బ్యూటీ పార్లర్లు, సెలూన్లపై ఇప్పటికే నిషేధం విధించిన తాలిబన్లు.. ఇప్పుడు నెక్టైలపై నిషేధం విధించేందుకు సిద్ధమయ్యారు. నెక్‌టైలు క్రైస్తవ శిలువను పోలి ఉండటమే ఇందుకు కారణం! ఈ విషయాన్ని ‘ది ఇన్విటేషన్ అండ్ గైడెన్స్ డైరెక్టరేట్’ డైరెక్టర్ మొహమ్మద్ హషిమ్ షాహీద్ వ్రార్ వెల్లడించారు. అఫ్గాన్‌లో మతపరమైన విధానాలను నిర్ణయించే స్వతంత్ర సంస్థ ది ఇన్విటేషన్ అండ్ గైడెన్స్ డైరెక్టరేట్. టెలివిజన్ ప్రసంగంలో షాహీద్ వ్రార్ మాట్లాడుతూ.. ‘కొన్ని సార్లు నేను హాస్పిటల్స్, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ముస్లిం యువకులు నెక్‌టైలు ధరించడం చూశా. నెక్టైలకు మూలం ఏంటి? క్రైస్తవ శిలువ’ అని పేర్కొన్నారు. నెక్టైలపై నిషేధం విధిస్తే, పురుషుల వస్త్రధారణపై ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి అవుతుంది.
2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు మహిళలపై అనేక ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. మహిళలు యూనివర్సిటీ విద్యను అభ్యసించడాన్ని నిషేధించడంతోపాటు పాఠశాల విద్యపైనా అనేక ఆంక్షలు విధించారు. బ్యూటీ పార్లర్లను నిషేధించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

