వాట్సాప్‌లో త్వరలో యాడ్స్!
భారతీయులు పెద్ద సంఖ్యలో వాడుతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్' వినియోగంపై ‘మెటా’ కీలక ప్రకటన చేసింది. మరికొద్ది నెలల్లో వాట్సాప్‌లో ప్రకటనలు(యాడ్స్), సబ్స్క్రిప్షన్ ప్రవేశపెడుతున్నామని వాట్సాప్ మాతృ సంస్థ ‘మెటా’ సోమవారం ప్రకటించింది.
- అప్డేట్స్ ట్యాబ్‌లో ఇకపై ప్రకటనలు
కాలిఫోర్నియా: భారతీయులు పెద్ద సంఖ్యలో వాడుతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ వినియోగంపై ‘మెటా’ కీలక ప్రకటన చేసింది. మరికొద్ది నెలల్లో వాట్సాప్‌లో ప్రకటనలు(యాడ్స్), సబ్స్క్రిప్షన్ ప్రవేశపెడుతున్నామని వాట్సాప్ మాతృ సంస్థ ‘మెటా’ సోమవారం ప్రకటించింది. ఇకపై యాప్‌లోని అప్డేట్స్ ట్యాబ్‌లో అడ్వైర్టెజ్‌మెంట్‌కు సంబంధించిన ఫీచర్లు తీసుకురానున్నట్టు తన బ్లాగ్‌పోస్టులో వాట్సాప్ వెల్లడించింది. అప్డేట్స్ ట్యాబ్‌లో చానళ్లు, స్టేటస్ విభాగాల్లో ఇవి కనిపించనున్నాయి. యాప్ వాడేవారిలో 150 కోట్ల మంది రోజూ ఈ అప్డేట్స్ ట్యాబ్ చూస్తుంటారని అంచనా. ఈ నేపథ్యంలో అడ్మిన్లకు, ఆర్గనైజర్లకు, వ్యాపారులకు యాప్ ద్వారా ఎదిగేందుకు అవకాశం కల్పించేలా ప్రకటనలు తీసుకొస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. ఛానల్ సబ్స్క్రిప్షన్: నెలవారీ ఫీజు చెల్లించి మీకు ఇష్టమైన చానల్‌కు సపోర్ట్ చేయొచ్చు. ప్రమోటెడ్ ఛానల్: ప్రస్తుతం ఛానల్స్‌ను ఎక్స్ప్లోర్స్ చేస్తే ట్రెండింగ్‌లో ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. ఇకపై అడ్మిన్లు కొంత మొత్తం చెల్లించి తమ ఛానల్‌ను ప్రమోట్ చేసుకోవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

