మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ తన గర్ల్ ఫ్రెండ్, పిల్లల కోసం అక్రమ నిధులతో భారీగా ఆస్తులు కూడబెడుతున్నారని ఇండిపెండెంట్ సంస్థ పేర్కొంది. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం ఒలింపిక్ జిమ్నాస్టిక్స్ విజేత అలీనా కబయేవా(39) చాలా కాలం నుంచి పుతిన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. ఆమె కోసం పుతిన్ సైప్రస్‌లో రూ.990 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు. కబయేవా కుటంబ సభ్యుల కోసం పుతిన్ ఖరీదైన ఆస్తులు కొన్నట్టు ఆరోపణలు వచ్చాయి.