Rishi Sunak | బ్రిటన్ జాత్యహంకార దేశం అంటే నేను నమ్మను : రిషి సునాక్
'హ్యారీ అండ్ మేఘన్స్' డాక్యుమెంటరీపై వివాదం
Rishi Sunak : బ్రిటన్ జాత్యహంకార దేశం కాదని తాను వంద శాతం నమ్ముతున్నాని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ అన్నారు. లాథ్వియా రాజధాని రీగాలో ఆయన మీడియాతో మాట్లాడారు. యువరాజు హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ పేరుతో వచ్చిన డాక్యుమెంటరీపై చెలరేగిన వివాదం గురించి విలేకరుల ప్రశ్నలకు రిషి ఈ విధంగా స్పందించారు. బ్రిటన్ను జాత్యహంకార దేశంగా పిలవడాన్ని ఆయన ఖండించారు. ‘భారత సంతతికి చెందిన తాను బ్రిటన్‌కు మొదటి ప్రధాని అయ్యానని, తాను ఈ మాట చెప్పడం వల్ల కచ్చితంగా ప్రభావం ఉంటుందని భావిస్తున్నా. మనదేశ సంస్కృతి, పోరాటపటిమ, అందం చూసి నేను గర్విస్తున్నా’ అని రిషి తెలిపారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ఈమధ్యే ‘హ్యారీ అండ్ మేఘన్స్’ డాక్యుమెంటరీ ప్రసారం అయింది. టీవీ ప్రజెంటర్, కాలమిస్ట్ జెరెమీ క్లార్క్సన్ ఆ డాక్యుమెంటరీ మీద ‘ది సన్’ అనే వెబ్సైట్లో మేఘన్ పట్ల అసహ్యం వ్యక్తం చేస్తూ వ్యాసం రాశాడు. దాంతో అతని వార్త జాత్యహంకారం కిందకు వస్తుందని ఇండెపెండెంట్ ప్రెస్ స్టాండర్డ్స్ ఆరగ్గనేషన్లో 6 వేల ఫిర్యాదులు నమోదయ్యాయి. 60 మంది బ్రిటన్‌కు ఎంపీలు జెరెమీపై చర్యలు తీసుకోవాలని ది సన్ ఎడిటర్ విక్టోరియా న్యూటన్‌కు లెటర్ రాశారు. దాంతో జెరెమి క్షమాపణలు చెప్పాడు. ది సన్ కూడా అతడి వ్యాసాన్నివెబ్సైట్ నుంచి తొలగించింది. ఆఫ్రికా- అమెరికన్ మూలాలున్న మేఘన్ మార్కెల్, బ్రిటన్ యువరాజు హ్యారీ 2018 మేలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

