54 ఏళ్ల పాటు వ్యభిచార వృత్తి.. రిటైరైనా ఆమే హాట్ టాఫిక్

హైదరాబాద్: అమెరికాలోని నెవడా రాష్ట్రంలో వ్యభిచారం చట్టబద్దం. ఆ రాష్ట్రంలో ఉన్న లాస్ వెగాస్ .. గ్యాంబ్లింక్కు పెద్ద అడ్డా. అక్కడకు వచ్చే కస్టమర్లను సంతృప్తిపరచడం బీట్రైస్ థాంప్సన్‌కు అతిసులువైన పని. 76 ఏళ్ల మహిళ బీట్రైస్ థాంపన్ ఆ వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఏడాది పూర్తి అవుతోంది. అయితే ఆమె పేరు మళ్లీ సోషల్ నెట్వర్క్ సైట్లలో మారుమాగుతోంది. రెడ్డిట్ నెట్‌వర్క్‌లో థాంప్సన్‌ను కొందరు మెచ్చుకుంటున్నారు. కొందరైతే ఆమెపై జోకులు వేస్తున్నారు. ఆమె స్టోరీ ఏందో ఒకసారి తెలుసుకుందాం.
సెక్స్ వర్కర్ బీట్రైస్ థాంప్సన్‌ను పాపులర్‌గా బీట్రైస్ 3$ థాంప్సన్‌గా పిలుస్తారు. నెవడాలో ఉన్న వ్యభిచారంలో థాంప్సన్‌కు ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నది. సెక్స్ ఇండస్ట్రీలోకి తొలుత అడుగుపెట్టిన రోజుల్లో.. ఆమె కస్టమర్ల నుంచి కేవలం మూడు డాలర్లు తీసుకునేదట. అందుకే ఆమెకు 3$ అని నిక్‌నేమ్ పెట్టారు. ఆ తర్వాత అందించిన సేవలకు కూడా ఆమెను గుర్తించారు. 1969 నుంచి 1992 నుంచి థాంప్సన్‌కు 17 సార్లు సెక్స్ వర్కర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. 2011లో ఆమెకు జీవితకాల సాఫల్య అవార్డును ఇచ్చారు. 54 ఏళ్ల పాటు వ్యభిచార సేవలు అందించిన థాంప్సన్.. గత ఏడాది తన వృత్తికి రిటైర్మెంట్ ఇచ్చారు. పడుపు వృత్తి ద్వారా ఆమె సుమారు అయిదు లక్షల మంది కస్టమర్లను సంతృప్తిపరిచింది. వారిలో నలుగురు అమెరికా మాజీ అధ్యక్షులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
జర్మనీకి చెందిన 34 ఏళ్ల వ్యక్తి ఆమె చివరి కస్టమరట. బీట్రైస్తో సంభోగం కోసం అతను సుమారు 5400 మైళ్ల దూరం నుంచి వచ్చాడట. తన వద్ద ప్రతి ఒక్కరి డాక్యుమెంట్లు ఉన్నట్లు ఆమె చెబుతోంది. ఉద్యోగుల రికార్డులు, ట్యాక్సు రికార్డులు, వేల మంది కస్టమర్ల రివ్యూలు తన వద్ద ఉన్నట్లు బీట్రైస్ థాంప్సన్ చెప్పింది. ఒక్కొక్క దశలో ఒకే రోజు సుమారు 50 నుంచి వంద మంది కస్టమర్లను సంతృప్తిపరిచినట్లు థాంప్సన్ వెల్లడించింది.
రెడ్డిట్ సైట్లో జరుగుతున్న చర్చల్లో కొందరు నెటిజన్లు థాంప్సన్‌కు థ్యాంక్స్ చెప్పారు. దేశానికి చెందిన గొప్ప సేవకురాలు అని కొందరంటున్నారు. నలుగురు అధ్యక్షులతో గడిపినా.. ఆమె తన రేటు పెంచుకోలేదని కొందరన్నారు. నెవడాలో నివసిస్తున ఆమె ఇలా చేయడం ఆశ్చర్యం కాదని కొందరన్నారు. తన రికార్డు గురించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆర్గనైజేషన్‌తో భేటీకావాలని థాంప్సన్ పేర్కొన్నది.
5లక్షల కస్టమర్లను కలిసినట్లు తన వద్ద రికార్డులు ఉన్నా.. గిన్నిస్‌లో మాత్రం ఆమెకు స్థానం దక్కలేదు. అయితే ఎక్కువ సంఖ్యలో వ్యభిచార రికార్దు లూయిస్ అండ్ మారైన్ ఫోక్కెన్స్ పేరిట ఉన్నది. ఈ ఇద్దరూ ఆమ్స్టర్డామ్ రెడ్‌లైట్ ఏరియాలో వ్యభిచారులు. ఇద్దరు కలిసి సుమారు 3.5 లక్షల మందిని సంతృప్తిపరిచినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

