Pakistan Woman: డ్రెస్సుపై అరబిక్ అక్షరాలు.. ఆ మహిళను చుట్టుముట్టిన పాకిస్థానీలు
Pakistan Woman: ఓ మహిళ వేసుకున్న డ్రెస్సుపై అనుమానం రావడంతో.. ఆమెను కొందరు చుట్టుముట్టేశారు. అరబిక్ భాషలో ప్రింట్ అయిన అక్షరాలను చూసి.. అవి ఖురాన్ వచనాలు అనుకున్నారు. ఆ మహిళ దైవ దూషణకు పాల్పడుతుందని భావించారు. కానీ అసలు నిజం తెలుసుకున్న తర్వాత ఆమెను విడిచిపెట్టారు. లాహోర్‌లో ఈ ఘటన జరిగింది.
లాహోర్: అరబిక్ భాషలో అక్షరాలు ప్రింట్ చేసి ఉన్న డ్రెస్సును ఓ పాకిస్థాన్ మహిళ(Pakistan Woman) ధరించింది. అయితే ఆ మహిళ దైవ దూషణకు పాల్పడుతుందన్న అనుమానాంతో కొందరు వ్యక్తులు ఆమెను వేధించారు. ఈ ఘటన లాహోర్ రెస్టారెంట్లో ఆదివారం జరిగింది. ఆమె వేసుకున్న దుస్తులపై ఖురాన్ వచనాలను రాశారని ఆమెను దిగ్భందించారు. అయితే పోలీసులు ఆ హోటల్‌కు చేరుకుని ఆమెను రక్షించారు. ఆ తర్వాత ఆమె ఈ అంశంపై క్షమాపణలు కూడా చెప్పింది.
అరబిక్ భాషలో హల్వా అనే పదం ఆమె డ్రెస్సుపై రాసి ఉన్నది. ఖురాన్‌ను కించపరుస్తూ డ్రెస్సుపై అక్షరాలు రాసి ఉంటుందన్న అనుమానంతో సుమారు 300 మంది ఆమెను చుట్టుముట్టారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ఆన్లైన్లో వైరల్ అయ్యింది. రెస్టారెంట్లో ఆ మహిళ వణుకుతూ కూర్చుండిపోయింది.
ఇంతకీ ఆమె డ్రెస్సుపై రాసి ఉన్న అక్షరాలు ఏంటో ఎవరికీ తెలియదని, దీంతో ఆ మహిళను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లినట్లు అధికారులు చెప్పారు. అయితే మతగురువులు వచ్చి ఆ డ్రెస్సుపై ఉన్న అక్షరాలను డీకోడ్ చేశారు. ఆ డ్రెస్సుపై ఉన్నది అరబిక్ కాలీగ్రఫీ అని, అవి ఖురాన్ సూక్తులు కావన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

