Venezuela Earthquake: వెనిజువెలా భూకంపం.. 6 రోజుల తర్వాత శిథిలాల నుంచి మూడేళ్ల చిన్నారి రెస్క్యూ
Venezuela Earthquake: భూకంప శిథిలాల కింద ఆరు రోజులుగా సజీవంగా ఉన్న మూడేళ్ల చిన్నారిని రక్షించారు. ప్రాణాలతో ఉన్న ఆ పిల్లోడిని ఆస్పత్రికి తరలించారు. వెనిజువెలా జంట భూకంపాల వల్ల సుమారు రెండు వేల మంది వరకు మరణించారు. 58 వేల బిల్డింగ్లు కూలాయి.
కరాకస్: వెనిజువెలా భూకంప(Venezuela Earthquake) శిథిలాల నుంచి ఆరు రోజుల తర్వాత మూడేళ్ల చిన్నారిని రెస్క్యూ చేశారు. జోర్డాన్ రెస్క్యూ బృందానికి ఆ చిన్నారి చిక్కాడు. ఆ పిల్లాడి పేరు కీబర్ మోరన్. లా గైరియా రాష్ట్రంలో కూలిన బిల్డింగ్ శిథిలాల నుంచి ఆ చిన్నారిని రక్షించినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ తెలిపారు. కీబర్కు ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించారు. ఆ పిల్లవాడిని ఆస్పత్రికి తరలించినట్లు జెర్డాన్ డిఫెన్స్ పేర్కొన్నది. రాజధాని కరకాస్లో అతనికి చికిత్స జరుగుతోంది. వెనిజువెలాలో జంట భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఆ భూకంపాల వల్ల వేల మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, షెల్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. రెండు భూకంపాల వల్ల 1943 మంది మృతిచెందారు. సుమారు పదివేల మంది గాయపడ్డారు. ఇంకా వేల సంఖ్యలో జనం ఆచూకీ లేదు. ఆ రెండు భారీ భూ కంపాల వల్ల సుమారు 58,870 బిల్డింగ్లు కూలినట్లు నాసాకు చెందిన శాటిలైట్ డేటా అంచనా వేసింది.
In Venezuela, a three-year-old child was pulled alive from the rubble after six days.
The child named Kleiber Moran was rescued from the rubble in La Guaira state, one of the hardest-hit areas. The boy was rushed to the hospital.pic.twitter.com/wnQ6U0hCBv
— Visegrád 24 (@visegrad24) July 1, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

