Harry Potter | రూ. 11 లక్షలు పలికిన అరుదైన హారీపాటర్ తొలి ఎడిషన్ బుక్
హారీపాటర్ (Harry Potter) అరుదైన ఫస్ట్ ఎడిషన్ బుక్ ఏకంగా రూ. 11 లక్షలు పలికింది. రిచర్డ్ వింటర్టన్ ఆక్షనీర్స్ చేపట్టిన వేలంలో హారీపాటర్ ఫస్ట్ ఎడిషన్ ప్రతితో పాటు ఫిలాసఫర్ స్టోన్ భారీ ధర పలికాయి.
న్యూయార్క్ : హారీపాటర్ (Harry Potter) అరుదైన ఫస్ట్ ఎడిషన్ బుక్ ఏకంగా రూ. 11 లక్షలు పలికింది. రిచర్డ్ వింటర్టన్ ఆక్షనీర్స్ చేపట్టిన వేలంలో హారీపాటర్ ఫస్ట్ ఎడిషన్ ప్రతితో పాటు ఫిలాసఫర్ స్టోన్ భారీ ధర పలికాయి. 1997లో లామినేటెడ్ బోర్డ్ కవర్‌తో బ్లూమ్స్బురీ ప్రచురించిన హారీపాటర్ ఫస్ట్ ఎడిషన్ ప్రతులు కేవలం 500 కాగా, వాటిలో 300 కాపీలను లైబ్రరీలకు పంపారు.
ఈ అరుదైన కాపీ అసలు ధర కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ధరకు లాస్ఏంజెల్స్ నుంచి ఆన్లైన్ బిడ్ దాఖలవగా, ఆ బిడ్ ఈ అరుదైన బుక్‌ను సొంతం చేసుకుంది. హారీపాటర్ బుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..రూ. 11 లక్షలకు బిడ్ దాఖలైందని ఆక్షన్ హౌస్ ఫేస్బుక్ క్యాప్షన్‌లో పేర్కొంది.
ఈ అరుదైన బుక్కు వచ్చిన స్పందన అద్భుతమని, జేకే రౌలింగ్ ఒరిజినల్ సిరీస్‌లో ఫస్ట్ ఎడిషన్‌ను కోట్లాది మంది చదివారని, దీనిపై ఇప్పటికీ లైబ్రరీ ఐడెంటిఫికేషన్ స్టిక్కర్, జేకే రౌలింగ్ లెటర్‌తో కూడిన స్టిక్కర్ ఉన్నాయని, బుక్‌పై లైబ్రరీ స్టాంప్ కూడా ఉందని వేలం నిర్వాహకులు రిచర్డ్ వింటర్టన్ పేర్కొన్నారు.
Read More :
Ministe KTR | తయారీ రంగంలో ప్రపంచానికి ఆదర్శం జపాన్: మంత్రి కేటీఆర్
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- auctioned
- book
- Harry Potter
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

