లండన్ : బ్రిటన్‌లో ‘వారానికి 4 రోజుల పని దినాలు’ పైలట్ పథకం విజయవంతమైంది. గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన ఈ ట్రయల్‌లో పలు రంగాలకు చెందిన 61 కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో పాల్గొన్న వాటిలో మెజారిటీ కంపెనీలు కొత్త పని విధానాన్ని కొనసాగిస్తామని ప్రకటించాయి. ఈ ట్రయల్ రన్‌ను లాభాపేక్ష లేని ‘4 డే వీక్ గ్లోబల్’, ‘4 డే వీక్ క్యాంపెయిన్’, ‘అటానమీ’ మేథోసంస్థ నిర్వహించాయి. దాదాపు 3 వేల మంది ఉద్యోగులు, కార్మికులకు సాధారణ ఐదు రోజుల పని దినాలకు ఇచ్చే వేతనమే చెల్లించి ఈ విధానాన్ని అమలు చేశారు.