Viral pic: అది సర్ఫ్బోర్డు కాదు.. వందేళ్ల లైవ్ ఫిష్.. ఎంత పొడువుందో చూడండి!!
మీకు ఫొటోలో కనిపిస్తున్నది సర్ఫ్బోర్డు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అది వందేళ్ల వయస్సున్న లైవ్ ఫిష్. కెనడాలో ఇటీవల మొదటసారిగా దొరికింది. ఈ భారీ చేపను బ్రిటీష్ కొలంబియాలో మత్స్యకారులు మొదటిసారిగా పట్టుకున్నారు. దీని పొడవు పది అడుగుల కంటే ఎక్కువగా ఉంది. దీని చుట్టుకొలత 57 అంగుళాలు. దీని వయస్సు వందేళ్ల ఉంటుందని వారు అంచనా వేశారు. ఈ భారీ చేప ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ చేపను లిలూయెట్, బీసీ సమీపంలో స్టీవ్ ఎక్లండ్, మార్క్ బోయిస్ అనే మత్స్యకారులు పట్టుకున్నారు. ఈ చేపను తమ పడవలోకి ఎక్కించేందుకు వారు దాదాపు రెండు గంటలు కుస్తీపట్టారు. ఇది దాదాపు 317 కిలోలు ఉంటుందని స్టీవ్ ఎక్లండ్ పేర్కొన్నాడు.
ఈ చేప పేరు స్టర్జన్. అసిపెన్సెరిడే కుటుంబానికి చెందిన 27 జాతుల చేపలకు స్టర్జన్ అనేది సాధారణ పేరు. వైట్ స్టర్జన్ ఉత్తర అమెరికాలో అతిపెద్ద మంచినీటి చేప. 14 అడుగుల పొడవు, 1,500 పౌండ్ల వరకు బరువుంటుంది. ఈ చేపలు 150 ఏళ్ల వరకు జీవించగలవని ఫ్రేజర్ రివర్ స్టర్జన్ కన్జర్వేషన్ సొసైటీ పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?