న్యూయార్క్, జూలై 2: ఫొటోలో కనిపిస్తున్న బామ్మ పేరు బెట్టె నాష్. వయసు 86 ఏండ్లు. అమెరికాకు చెందిన ఈమె 1957లో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఎనిమిది పదుల వయసు దాటిపోతున్నా ఇప్పటికీ అదే సంస్థలో కొనసాగుతున్నారు. అందుకే, ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కురాలైన ఫ్లైట్ అటెండెంట్‌గా ఆమె గిన్నిస్ రికార్డుల్లోకెక్కారు.