Plane Crashes | కొలంబియా దేశంలోని నివాస ముదాయంలో ఓ విమానం కుప్పకూలింది. కొలంబియాలోని రెండో అతిపెద్ద నగరం మెడెలిన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే…
ఒలాయా హెర్రెరా విమానాశ్రయం నుంచి ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో బయలుదేరిన విమానం.. ఇంజిన్ వైఫల్యంతో ఓ భవనంపై కుప్పకూలినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#ÚltimaHora | Según informó el alcalde de la ciudad de Medellín, en Colombia, una avioneta se estrelló en una zona residencial. Video cortesía: @AlertaNews24 pic.twitter.com/Kn2H5V0sDB
— elsalvador.com (@elsalvadorcom) November 21, 2022