Serbia | సెర్బియాలో మళ్లీ పేలిన తుపాకీ.. దుండగుడి కాల్పుల్లో 8 మంది మృతి
సెర్బియాలో (Serbia) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రాజధాని బెల్గ్రెడ్కు (Belgrade) సమీపంలోని మ్లడొనోవాక్లో (Mladenovac) దుండగుడు ఆటోమెటిక్ వెపన్తో (Automatic weapon) కాల్పులకు తెగబడ్డాడు.
బెల్గ్రెడ్: సెర్బియాలో (Serbia) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రాజధాని బెల్గ్రెడ్కు (Belgrade) సమీపంలోని మ్లడొనోవాక్లో (Mladenovac) దుండగుడు ఆటోమెటిక్ వెపన్తో (Automatic weapon) కాల్పులకు (Shooting) తెగబడ్డాడు. దీంతో ఎనిమిది మంది మృతిచెందగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం సాయంత్రం కదులుతున్న వాహనంలో నుంచి ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని, అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని స్థానిక మీడియా వెల్లడించింది. నిందితుడి కోసం పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారని, పెద్ద ఎత్తున బలగాలను మోహరించారని పేర్కొన్నది. కాగా, సెర్బియాలో కాల్పుల ఘటన గత రెండు రోజుల్లో ఇది రెండోసారి.
బుధవారం సెంట్రల్ బెల్గ్రేడ్లో (Belgrade elementary school) ఉన్న వ్లాదిస్లావ్ రిబ్నికర్ స్కూల్లో 14 ఏండ్ల బాలుడు కాల్పులు జరిపాడు. దీంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 8 మంది విద్యార్థులు కాగా, మరొకరు స్కూల్లో గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ఉన్నాడు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తన తండ్రి తుపాకీని తీసుకుని స్కూల్కు వెళ్లిన బాలుడు.. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరో ఆరుగురు విద్యార్థులు, ఒక టీచర్ గాయపడ్డారు.

Serbia1
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

