యుద్ధనౌకపై కూలిన ఎఫ్-35.. అమెరికా సైనికులకు గాయాలు

వాషింగ్టన్: అమెరికా యుద్ధనౌక కార్ల్ విన్సన్‌పై.. ఫైటర్ విమానం ఎఫ్-35సీ కూలింది. ల్యాండింగ్ సమయంలో జరిగిన అపశృతి వల్ల ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రమాదంలో ఏడు మంది అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ చైనా సముద్రంలో ఈ ఘటన జరిగింది. అయితే ఫైటర్ జెట్‌లో ఉన్న పైలెట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. రొటీన్‌గా జరిగే ఫ్లయిట్ ఆపరేషన్స్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అమెరికా నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. పైలెట్‌ను మిలిటరీ హెలికాప్టర్ రక్షించింది. అతని పరిస్థితి నిలకడగా ఉంది. అయితే మొత్తం ఘటనలో ఏడు మంది సెయిలర్లు గాయపడ్డారు. ముగ్గురిని చికిత్స కోసం మనీలాకు పంపించారు. యుద్ధనౌకపైనే మరో నలుగురికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు నేవీ చెప్పింది. ఎఫ్-35 యుద్ధ విమానాలను లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు ఉన్నాయి. కార్ల్ విన్సన్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్లు సైనిక శిక్షణలో పాల్గొంటున్నాయి. తైవాన్‌కు అండగా ఆ నౌకలు అక్కడకు వెళ్లాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

