లండన్ : చైనా అణు జలాంతర్గామి తాను తీసిన గోతిలో తానే పడింది. ఫలితంగా 55 మంది చైనా సెయిలర్ల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఎల్లో సముద్రంలో అమెరికా, మిత్ర దేశాల జలాంతర్గాములు ప్రవేశించకుండా చైనా రహస్యంగా భారీ వలలను ఏర్పాటు చేసింది.
వీటిలో చైనా అణు జలాంతర్గామి చిక్కుకుంది. అన్ని వ్యవస్థలు మొరాయించడంతో బయటపడే మార్గం లేక అందులోని 55 మంది ఊపిరాడక మృతి చెందినట్టు తెలిసింది.