అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ.. నిందితుడు సహా ఐదుగురు మృతి
Oklahoma | అమెరికాలో తుపాకుల మోత కొనసాగుతున్నది. గతవారం టెక్సాస్‌లోని ఓ స్కూల్లో కాల్పుల ఘటన మరువక ముందే మరోసారి ఓ ఉన్మాది తుపాకీతో చెలరేగిపోయాడు. ఓక్లహోమాలోని (Oklahoma) తుల్సా నగరంలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ దవాఖాన
వాషింగ్టన్: అమెరికాలో తుపాకుల మోత కొనసాగుతున్నది. గతవారం టెక్సాస్‌లోని ఓ స్కూల్లో కాల్పుల ఘటన మరువక ముందే మరోసారి ఓ ఉన్మాది తుపాకీతో చెలరేగిపోయాడు. ఓక్లహామాలోని (Oklahoma) తుల్సా నగరంలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ దవాఖాన ప్రాంగణంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు.

నలుగురిని కాల్చిన తర్వాత అతడు కూడా కాల్చుకుని చనిపోయాడని వెల్లడించారు. అతడు ఎవరేనిది గుర్తించాల్సి ఉన్నదని తుల్సా పోలీస్ డిప్యూటీ చీఫ్ జొనాథన్ బ్రూక్స్ తెలిపారు. నిందితుని వద్ద రైఫిల్, హ్యాండ్‌గన్ ఉన్నాయని చెప్పారు.
అమెరికాలో మే నెలలో రెండు భారీ కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. గత వారం టెక్సాస్ రాష్ట్రం ఉవాల్డాలోని ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 19 విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించారు. ఇక మే మొదటి వారంలో న్యూయార్క్‌లోని బఫాలో నగరంలో ఉన్న సూపర్మార్కెట్లో దుండగుడు కాల్పులు జరిగింది. దీంతో పది మంది మృతిచెందారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

