Omicron Shock | హాలీడే ట్రిప్‌కు ఒమిక్రాన్ షాక్.. 4500 విమానాలు రద్దు!
Omicron Shock | హాలీడే ట్రావెల్‌కు ఒమిక్రాన్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో 4500 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

Omicron Shock | కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగింది.. ప్రభావం తగ్గుతుందన్న అంచనాల మధ్య చాలా మంది కుటుంబాలతో కలిసి క్రిస్మస్.. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు హాలీడే ట్రిప్‌లకు ప్లాన్ చేసుకున్నారు. భారత్‌లో దేశీయంగా.. అంతర్జాతీయంగా అత్యంత ప్రమాదకర ఒమిక్రాన్ వేరియంట్ వల్ల హాలీడే ప్రయాణాలకు గట్టి షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా 4,500కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఒక్క క్రిస్మస్ రోజే 2000 సర్వీసులు రద్దయ్యాయని ఫ్లైట్ అవేర్ డాట్ కాం శనివారం తెలిపింది. వీటిలో అమెరికాలోని వివిధ విమానాశ్రయాలకు వెళ్లాల్సిన 700 విమాన సర్వీసులున్నాయి. 1500కి పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం 2400 సర్వీసులు రద్దయ్యాయి. 11 వేల విమాన సర్వీసులు ఆలస్యంగా బయలుదేరాయి. ఇక ఆదివారం 600కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
లుఫ్తాన్సా, డెల్టా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పైలట్లతోపాటు క్రూ సిబ్బంది కోవిడ్ బారీన పడటంతో అస్వస్తతకు గురయ్యారు. క్వారంటైన్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా హాలీడే ట్రిప్స్ నిర్వహణలో బిజీగా ఉండే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ శుక్ర, శనివారాల్లో 200 విమానాలు రద్దుచేసింది. తొలుత షెడ్యూల్ చేసిన సర్వీసుల్లో 120 శాతం. డెల్టా శుక్రవారం 170, శనివారం 260 సర్వీసులు రద్దు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

