ముగియనున్న మెర్కల్ శకం.. ఛాన్సలర్‌గా పోటీలో ఉన్నది వీళ్లే !

బెర్లిన్: ఫెమినిస్ట్ ఐకాన్ ఏంజెలా మెర్కల్ శకం ముగియనున్నది. 16 ఏళ్ల పాటు జర్మనీ ఛాన్సలర్‌గా చేసిన మెర్కల్.. సెప్టెంబర్‌లో జరగనున్న ఎన్నికలతో తన కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టనున్నారు. అయితే ఛాన్సలర్ పదవి కోసం ఈ సారి ముగ్గురు పోటీపడుతున్నారు. అయిదోసారి ఎన్నికల పోటీలో నిలుచోవడం లేదని మూడేళ్ల క్రితం మెర్కల్ తెలిపారు. సోషల్ డెమోక్రాట్స్ ఇప్పటికే ఒలాఫ్ స్కోల్జ్‌ను అభ్యర్థిగా ఎంచుకున్నారు. గ్రీన్స్ తరపున అన్నాలినా బేయర్బాక్ పోటీలో ఉంటారు. ఇక మెర్కల్‌కు చెందిన సెంటర్ రైట్ యూనియన్ పార్టీ తరపున ఆర్మిన్ లాసెట్ పోటీలో నిలవనున్నారు.

ఒలాఫ్ స్కోల్జ్..
స్కోల్జ్ వయసు 63ఏళ్లు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి. వైస్ ఛాన్సలర్ కూడా. టాప్ పదువుల్లో ఉన్న ఆయన తన అనుభవంతో ఛాన్సలర్షిప్ కోసం పోటీపడనున్నారు. ఆయన స్వంత పట్టణం హామ్‌బర్గ్. ఒకప్పుడు లాయర్‌గా చేశారు. మెండైన ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో మెర్కల్ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా చేశారు. నిరుద్యోగ శాతాన్ని తగ్గించేందుకు.. ప్రభుత్వ ఆధారిత జీతాల వ్యవస్థను ఆయన రూపొందించారు. కరోనా సంక్షోభం వేళ కూడా ఈ విధానం పనికివచ్చింది. 2011లో హామ్‌బర్గ్ మేయర్ అయ్యారు. 2017లో జీ20 సదస్సును నిర్వహించారు.
అన్నాలినా బేయర్బాక్..
బేయర్బాక్ వయసు 40 ఏళ్లు. ఛాన్సలర్ పోటీలో నిలుచున్న అత్యంత పిన్న వయస్కురాలు. ఆమెకు ప్రభుత్వ అనుభవం పెద్దగా లేదు. హామ్‌బర్గ్, లండన్ నగరాల్లో ఆమె పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ లా చదివారు. 2013లో నుంచి జర్మనీ పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. టీనేజీలో ఆమె ట్రాంపోలినిస్ట్ ఆట ఆడారు. ఈమె స్వస్థలం వెస్ట్రన్ జర్మనీ. అయితే గ్రామీణ ప్రాంతమైన బ్రాండెన్‌బర్గ్‌లో ఉంటున్నారు.
ఆర్మిన్ లాసెట్..
ఆర్మిన్ వయసు 60 ఏళ్లు. నార్త్ రైన్-వెస్ట్పాలియా రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్నారు. జర్మనీలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం అదే. ఆర్మిన్ తండ్రి ఓ మైనింగ్ వ్యాపారి. స్వంత పట్టణం ఆచిన్లోనే ఆయన నివసిస్తున్నారు. బెల్జియం, నెదర్లాండ్స్‌తో ఉన్న సరిహద్దుల్లో ఆ నగరం ఉంది. ఆయన రాజకీయ కెరీర్లో ఎత్తుపల్లాలు ఉన్నాయి. 1994లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. పలుమార్లు ఓడిపోయారు కూడా. మెర్కల్‌కు చెందిన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ పార్టీ నాయకత్వాన్ని జనవరిలో ఆయన గెలుచుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

