US | ట్రక్ మీద డ్యాన్స్ వీడియో తీస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు
స్ట్రీట్ బ్రిడ్జి ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన యువకుడు
సోషల్‌మీడియాలో పాపులర్ కావాలనే కోరిక, కొత్త వీడియోలు పోస్ట్ చేయాలనే అత్యుత్సాహం కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుంది. అమెరికాలోని టెక్సాస్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. 25 ఏండ్ల ఒక యువకుడు ట్రక్ మీద ఎక్కి డాన్స్ చేస్తుండగా బ్రిడ్జి ఢీకొట్టింది. దాంతో ట్రక్ మీద నుంచి కిందపడ్డాడు. మెడ, చేతులకు తీవ్ర గాయాలైన అతడిని వెంటనే దగ్గర్లోని మెమోరియల్ హెర్మన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే అతను చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఈ ప్రమాదాన్ని ఆ దారి గుండా వెళ్తున్న మరో డ్రైవర్ వీడియో తీశాడు.
హోస్టన్‌లోని ఈస్టర్న్ ఫ్రీ వేలో వెళత్తున్న తెలుపు రంగు18 టైర్ ట్రక్కు మీద ఒక యువకుడు డాన్స్ చేస్తున్నాడు. ఎదురుగా బ్రిడ్జి ఉందనే సంగతి మరిచిపోయి హుషారుగా డాన్స్ చేస్తూ, వీడియో రికార్డు చేస్తున్నాడు. అయితే, మొదటిసారి ఒక బ్రిడ్జి ఎదురుకావడంతో వెంటనే కిందిగి వంగి తప్పించుకున్నాడు. కానీ, రెండోసారి తప్పించుకోలేకపోయాడు. దాంతో, బ్రిడ్జి బలంగా ఢీకొట్టడంతో ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదం నవంబర్ 10వ తేదీన ఉదయం 11:30 గంటలకు హోస్టన్‌లోని టువాన్ స్ట్రీట్ బ్రిడ్జి వద్ద జరిగిందని హోస్టన్ పోలీసులు తెలిపారు. పోయిన నెలలో కూడా కొందరు అమెరికా యువకులు ట్రక్కుల మీదికి ఎక్కి, డాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.
https://metro.co.uk/video/man-dances-moving-truck-hit-bridge-2818241/?ito=vjs-link
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

