ఓస్లో: నార్వే రాజధాని ఓస్లోలో కాల్పులు కలంకలం సృష్టించాయి. ఓస్లోలోని ఓ నైట్‌క్లబ్‌లో (Nightclub) దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం నగరంలోని ప్రముఖ లండన్ పబ్ (గే బార్, నైట్ క్లబ్)లో కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. క్లబ్ సమీపంలో ఒక అనుమానితుడిని పట్టుకున్నామని చెప్పారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామని వెల్లడించారు.