ఏడంతస్తుల పైనుంచి పడిన వృద్ధుడు.. అతనితోపాటు మరొకరు మృతి
Elderly Man | స్వీడన్‌లోని ఉప్సలాలో విషాదం చోటుచేసుకుంది. ఏడంతస్తుల బిల్డింగ్ పైనుంచి ఓ వృద్ధుడు (Elderly Man) కిందపడిపోయాడు.

స్టాక్‌హోమ్: స్వీడన్‌లోని ఉప్సలాలో విషాదం చోటుచేసుకుంది. ఏడంతస్తుల బిల్డింగ్ పైనుంచి ఓ వృద్ధుడు (Elderly Man) కిందపడిపోయాడు. దీంతో అతనితోపాటు మరో వృద్ధుడు కూడా మరణించాడు. స్వీడన్‌లోని ఉప్సలాలో ఉన్న కన్సర్ట్ అండ్ కాంగ్రెస్ హాల్లో ఏబీబీఏ లెజెండ్స్ జోర్న్ ఉల్వాయస్, బెన్నీ ఆండర్సన్‌కు.. వారి అభిమానులు నివాళులర్పిస్తున్నారు. వేల సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాల్ మొత్తం సంగీతంతో హోరెత్తి పోతున్నది. ఇంతలో అనుకోని సంఘటన జరిగింది.
ఆ బిల్డింగ్‌లోని ఏడో అంతస్తు నుంచి 80 ఏండ్ల వృద్ధుడు కిందపడిపోయాడు. ఈక్రమంలో అతడు కార్యక్రమంలో పాల్గొన్న మరో ఇద్దరిపై పడ్డాడు. దీంతో వారిలో ఒకరు మరణించగా, మరో మహిళ తీవ్రంగా గాయపడిందని పోలీసులు తెలిపారు. వారు కూడా 60 ఏండ్ల వయస్సు పైబడినవారేనని చెప్పారు. కాగా, ఆ వృద్ధుడు ప్రమాద వశాత్తు కిందపడ్డాడా లేదా ఎవరైనా పడేశారా, ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే విషయం తెలుసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

