న్యూయార్క్: అమెరికాలోని ఫ్లోరిడిలో దారుణం చోటుచేసుకున్నది. పదే పదే తన గదిని శుభ్రం చేసుకోవాలని చెబుతున్నదని 17 కుర్రాడు తన తల్లిపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. ఫ్రయింగ్ ప్యాన్తో తల్లి తలపై దాడిచేసిన అతడు అనంతరం కత్తితో పొడిచాడు. తర్వాత ఆమె పర్సులో ఉన్న డబ్బు తీసుకుని కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా తన కొడుకే ఈ పనిచేసి పరారయ్యాడని తెలిపింది.
దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఓ అటవీ ప్రాంతంలో పట్టుకున్నారు. విచారణ సందర్భంగా గదిని శుభ్రం చేసుకోవాలని తరచు చెబుతుండటంతో ఫ్రయింగ్ ప్యాన్తో ఆమెను కొట్టానని, అనంతరం కత్తితో పొడిచానని చెప్పాడు. ఆమెను గన్తో కాల్చాలని తన స్నేహితునికి చెప్పానని వెల్లడించాడు.