11 ఏండ్ల చిన్నారికి ‘పెయిన్ సిండ్రోమ్’
ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కు చెందిన 11 ఏండ్ల చిన్నారి ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి ‘పెయిన్ సిండ్రోమ్'కు గురైంది. 2020లో జాజ్మిన్ ఫార్ కాలికి చిన్నపాటి గాయం కాగా, అది ‘కాంప్లెక్స్ రీజినల్ పెయిన్ సిండ్రోమ్' (సీఆర్పీఎస్)కు దారితీసిందని వైద్యులు తేల్చారు. దీంతో ఆమె చాలాకాలంగా భరించలేని నొప్పితో బాధపడుతున్నది. కిడ్నీలో రాళ్లు, తీవ్రమైన మైగ్రేన్, పంటినొప్పి..
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కు చెందిన 11 ఏండ్ల చిన్నారి ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి ‘పెయిన్ సిండ్రోమ్’కు గురైంది. 2020లో జాజ్మిన్ ఫార్ కాలికి చిన్నపాటి గాయం కాగా, అది ‘కాంప్లెక్స్ రీజినల్ పెయిన్ సిండ్రోమ్’ (సీఆర్పీఎస్)కు దారితీసిందని వైద్యులు తేల్చారు. దీంతో ఆమె చాలాకాలంగా భరించలేని నొప్పితో బాధపడుతున్నది. కిడ్నీలో రాళ్లు, తీవ్రమైన మైగ్రేన్, పంటినొప్పి.. తర్వాత ‘సీఆర్పీఎస్’ను అత్యంత నొప్పితో కూడిన బాధాకరమైన వ్యాధిగా ‘మెక్‌గిల్ పెయిన్ ఇండెక్స్’ పేర్కొన్నది. ఎన్ని మందులు తీసుకున్నా ఉపశమనం కలగటం లేదని, రోజువారీ పనులు సైతం చేసుకోలేక పోతున్నదని జాజ్మిన్ ఫార్ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. చికిత్స కోసం అమెరికా తీసుకెళ్తున్నామని ఆమె తల్లి వివరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Canberra
- pain syndrome
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

