అమెరికా వర్శిటీ క్యాంపస్ సమీపంలో కాల్పులు.. ఒకరు మృతి

వాషింగ్టన్: అమెరికా జార్జియా రాష్ట్రంలోని ఫోర్ట్ వ్యాలీ స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో శనివారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది మందిపై కాల్పులు జరిగాయని, ఒకరు చనిపోయారని పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఫోర్ట్ వ్యాలీ స్టేట్ యూనివర్శిటీ విద్యార్థి కాదని జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (జీబీఐ) తెలిపింది. గాయపడిన ఏడుగురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పింది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని పేర్కొంది. కాల్పులకు పాల్పడిన వారిని గుర్తించడంలో సహాయం చేయాలని జీబీఐ కోరింది.
మరోవైపు ఈ కాల్పుల ఘటన అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా యూనివర్సిటీ క్యాంపస్‌ను కొంతసేపు మూసివేశారు. అనంతరం విద్యార్థులకు నిబంధనలు సడలించారు. అయితే ఆదివారం జరుగాల్సిన బహిరంగ కార్యక్రమాలను యూనివర్సిటీ రద్దు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

