అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
Oklahoma | అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. ఓక్లహోమాలో (Oklahoma) జరిగిన వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో మహిళ మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు.
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. ఓక్లహోమాలో (Oklahoma) జరిగిన వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో మహిళ మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున (అమెరికా కాలమానం ప్రకారం) ఓక్లహోమాలోని ఓల్డ్ సిటీ స్కేర్‌లో మెమోరియల్ డే ఫెస్టివల్ జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో 15 వందల మందికిపైగా పాల్గొన్నారు. అయితే ఆహుతుల మధ్య చిన్న గొడవ కాస్తా ఘర్షణకు దారితీసింది.

ఈ క్రమంలో సహనం కోల్పోయిన స్కైలర్ బక్నర్ అనే 26 ఏండ్ల యువకుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో ఓ నల్లజాతి మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో తొమ్మిదేండ్ల చిన్నారి కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అయితే కాల్పుల అనంతరం అక్కడినుంచి పారిపోయిన బక్నర్.. ఆదివారం సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతవారం టెక్నాస్‌లోని ఉవాల్డాలో ఓ లిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల కాల్పుల్లో ఆ ఉన్మాది కూడా హతమయ్యాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

