ఓజోన్‌కు మళ్లీ జీవం..

- పుడమికి తగ్గిన కర్బన భారం
ల్యాన్క్యాస్టర్, ఆగస్టు 19: ఆకాశంలో ఓజోన్ పొరను కాపాడుకోవడానికి చేపట్టిన చర్యలు భూమిపై కార్బన్ డై ఆక్సైడ్‌ను తగ్గించడంలో కూడా విశేషంగా దోహదపడ్డాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. క్లోరోఫ్లోరో కార్బన్(సీఎఫ్‌సీ) ఉద్గారాలను తగ్గించకపోతే ఈ శతాబ్దాంతానికి భూమిపై కార్బన్ డై ఆక్సైడ్(సీవో2) ఇప్పుడున్న దానితో పోలిస్తే 30% ఎక్కువగా ఉండేదని, ఫలితంగా భూతాపం బాగా పెరిగిపోయేదని ఆ నివేదిక వివరించింది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత(యూవీ) కిరణాలను ఓజోన్ పొర అడ్డుకొంటుంది. ఫలితంగా భూమి మీదకు వచ్చే యూవీ రేడియేషన్ తగ్గుతుంది. 1970లో కాలుష్యం కారణంగా(ముఖ్యంగా క్లోరోఫ్లోరో కార్బన్లు) ఓజోన్ పలుచబడటం ప్రారంభమైంది. అంటార్కిటిక్ జోన్లో ఓ చోట పొరకు చిల్లు కూడా పడింది. దీంతో ప్రపంచం మేల్కొన్నది. క్లోరోఫ్లోరో కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఉద్దేశించిన మాంట్రియాల్ ప్రొటోకాల్ ఒప్పందం జరిగింది. అధ్యయనంలో భాగంగా మాంట్రియాల్ ఒప్పందానికి ముందు పరిస్థితి అలా కొనసాగితే ఎలా ఉండేది… ఒప్పందం తర్వాత ప్రస్తుతం పరిస్థితిని పోల్చి చూశారు. మాంట్రియాల్ ఒప్పందం లేకపోతే ఈ శతాబ్దాంతానికి యూవీ రేడియేషన్ ఇప్పుడున్నదానితో పోల్చితే 4.5 రెట్లు ఎక్కువ ఉండేది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Earth
- Ozone Layer
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

