హైదరాబాద్: మాదాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్ రోడ్డులో పోలీసులు డ్రంక్ అండ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అధికారుల నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు యువకుల ప్రయత్నించారు. ఈ క్రమంలో బైక్ వేగాన్ని పెంచడంతో ప్రమాదానికి గురయ్యారు.
వేగంగా వెళ్తూ ప్రమాదవశాత్తూ ఎన్ఐఏ వద్ద కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మరణించగా, మరొక యువకుడికి తీవ్రమైన గాయాలయ్యాయి.