బ్లాక్మార్కెట్లో బ్లాక్‌ఫంగస్ ఇంజక్షన్లు.. యువకుడు అరెస్ట్
బ్లాక్‌మార్కెట్| కరోనా సమయంలో ప్రజల అవసరాలను పలువురు ఆదాయ వనురుగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనా, బ్లాక్‌ఫంగస్‌తో ఇబ్బంది పడుతున్న రోగుల చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్ చేస్తూ వారి సంబంధీకులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నారు.

హైదరాబాద్: కరోనా సమయంలో ప్రజల అవసరాలను పలువురు ఆదాయ వనురుగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనా, బ్లాక్‌ఫంగస్‌తో ఇబ్బంది పడుతున్న రోగుల చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్ చేస్తూ వారి సంబంధీకులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇలాంటివారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో బ్లాక్‌ఫంగస్ ఇంజక్షన్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సరూర్‌నగర్‌లో ఇంజక్షన్లను అమ్ముతుండగా పట్టుకున్నారు. నిందితుడు కూకట్పల్లి ప్రగతినగర్‌కు చెందిన గంగొళ్ల మనీశ్‌గా గుర్తించారు. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.35 వేలకు అమ్ముతున్నాడని తెలిపారు. అతనిపై కేసు నమోదుచేసి, ఇంజక్షన్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలను ఆరాతీస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

