ఉస్మానియా యూనివర్సిటీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో తార్నాకలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్యం, సమాజసేవ రంగాల్లో విశేష కృషి చేసినందుకు గాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షురాలు, ఆత్మీయ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు డాక్టర్ లక్కరాజు నిర్మలను ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ సమాజ సేవకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. తమకు తోచిన సహాయం చేస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.