నిమ్స్‌లో ఏం జరుగుతోంది?
అవినీతిలో కూరుకుపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిమ్స్ దవాఖానపై ఏసీబీ అధికారులు జరుపుతున్న వరుస దాడులతో అటు దవాఖాన సిబ్బంది, ఇటు రోగులు, ప్రజల్లో తీవ్ర అయోమయం నెలకొంది.
- వరుస తనిఖీలతో హడలెత్తిస్తున్న ఏసీబీ
- వివరాలు వెల్లడించకుండా మౌనం
సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): అవినీతిలో కూరుకుపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిమ్స్ దవాఖానపై ఏసీబీ అధికారులు జరుపుతున్న వరుస దాడులతో అటు దవాఖాన సిబ్బంది, ఇటు రోగులు, ప్రజల్లో తీవ్ర అయోమయం నెలకొంది. అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డా.లక్ష్మీ భాస్కర్‌ను అరెస్టు చేసినప్పుడు వివరాలు వెల్లడించిన ఏసీబీ అధికారులు.. ఆ తరువాత మూడు నాలుగు సార్లు వరుస దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో భాగంగా నిర్వహించిన తనిఖీలకు సంబంధించి ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి వివరాలను బయటకు వెల్లడించకపోవడంతో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఎవరకు వారు తమకు తోచినట్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో అటు నిమ్స్ ప్రతిష్ట దిగజారడమే కాకుండా నిజాయితీగా పనిచేసే అధికారులు, సిబ్బంది సైతం కలవరపడే అయోమయ పరిస్థితి నెలకొంది. లక్ష్మీభాస్కర్ అరెస్టు తరువాత నిమ్స్‌లో అవినీతి మూలాలు కదిలిన విషయం తెలిసిందే. దర్యాప్తు సంస్థలు సేకరించిన కీలక అంశాలతో నిమ్స్‌లో అవినీతి బాగోతం, అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఇప్పటికే దవాఖానలో అనేక సార్లు తనిఖీలు జరిపారు.
మందుల కొనుగోలు, మ్యాన్‌పవర్ టెండర్లు, క్యాంటీన్, మెడికల్ షాపులు తదితర టెండర్లు, నియామకాలు, ఆయా విభాగాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన అధికారులు.. వాటికి సంబంధించిన ఎలాంటి విషయాలకు ఇప్పటి వరకు వెల్లడించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దవాఖానలో తిష్ట వేసిన అవినీతి అధికారులు, అక్రమార్కులు ఏసీబీ కేసుల నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు వరుస తనిఖీలపై ఎలాంటి సమాచారం వెల్లడించకపోవడంతో అటు నిమ్స్ వర్గాలు, ఇటు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అసలు అవినీతి పరులను, అక్రమార్కులను జల్లెడ పడతారా లేక భాస్కర్ అరెస్ట్‌తోనే జలక్ ఇచ్చి సరిపెడతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

