వాహనాలకు నంబర్లు ఇలా..

- ఇంగ్లిష్ అక్షరాలు, అంకెల ఆధారంగా క్రమ పద్ధతిలో సిరీస్
- 9999 పూర్తయ్యాక 0001 నుంచి మొదలు
- ఆర్టీఏ జోన్ల వారీగా టీఎస్09, టీఎస్10, టీఎస్11 కేటాయింపు
- ఇటీవల ఖైరతాబాద్‌లో కొత్త సిరీస్ టీఎస్09ఎఫ్ఎస్0001తో షురూ
- నంబర్లను ఆన్లైన్లో సొంతం చేసుకునే అవకాశం
సిటీబ్యూరో, జూలై 3(నమస్తే తెలంగాణ): ప్రతి యేడాది కొత్త వాహనాలు లక్షల్లో రోడ్లెక్కుతుంటాయి. ప్రతి రోజు వేల సంఖ్యల్లో వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. అయితే, ఆ నంబర్ ప్లేట్‌పై ఉండే ఇంగ్లిష్ అక్షరాలు, సంఖ్యలు వేటిని సూచిస్తాయి? కొత్త సిరీస్ ప్రారంభమవడం అంటే ఏంటీ? ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు సిరీస్ కోడ్ ఏ విధంగా ఉంటుంది? నంబరింగ్ కోడ్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయి? టీఎస్10ఈజెడ్, టీఎస్09ఎఫ్ఎస్ తదితర కోడ్లను ఎలా రూపొందిస్తారు.? తదితర విషయాలపై రవాణా శాఖాధికారులు ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కావాల్సిన నెంబర్ బుకింగ్ ఇలా..!!
- తొలుత వాహనదారుడికి కావాల్సిన నంబర్‌ను ఆన్లైన్లో ఎంపిక చేసుకుని రూ.5వేలు చెల్లించాలి.
- ఇదే నంబర్‌కు ఇతర వాహనదారులు పోటీకి వస్తే సందేశం వస్తుంది.
- ఆ సమయంలో ఆ వాహనదారుడితో పోటీపడాల్సి ఉంటుంది.
- అంటే బిడ్డింగ్‌లో పాల్గొని అదనంగా రూ.5వేలకు పైన డబ్బులతో బిడ్ యాక్షన్‌లో పోటీపడాలి.
- ఇతర వ్యక్తి అంతకన్నా తక్కువ డబ్బులతో బిడ్‌లో ఉంటే, ఆ నంబర్ ఎక్కువగా డబ్బులు వేసిన వారికి వస్తుంది.
- బిడ్డింగ్‌లో తక్కువ డబ్బులు వేసిన వారికి వారి డబ్బులు మళ్లీ వారీ ఖాతాలో రవాణా శాఖ జమ చేస్తుంది.
- రూ.5 వేలు చెల్లించి నంబర్ బుక్ చేసుకున్నాక బిడ్డింగ్‌లో కచ్ఛితంగా పాల్గొనాలి. లేకపోతే ఆ డబ్బులు తిరిగి జమ కావు.
- ఏవైనా సందేహాలుంటే 040-23370081/83/84 నంబర్లకు ఫోన్ చేసి నివృతం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
నెంబరింగ్ ఇలా..
- హైదరాబాద్ నగరంలో ఐదు ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా కోడ్‌ను రూపొందిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్(టీఎస్09), హైదరాబాద్ నార్త్ జోన్(టీఎస్10), హైదరాబాద్ ఈస్ట్ జన్(టీఎస్11), హైదరాబాద్ సౌత్ జోన్లకు(టీఎస్12)లను తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం, సిరీస్‌లను ఏర్పాటు చేశారు.
- ఆయా ఆర్టీఏ జోన్ పరిధిలో ఉన్న వాహనాలన్నీ సంబంధిత సిరీస్‌తో రిజిస్టర్ అవుతాయి. ఇక ఇంగ్లిష్ అక్షరాల విషయానికి వస్తే ఉదాహరణకు ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో టీఎస్09 కోడ్ అనంతరం, వచ్చే ఇంగ్లిష్ అక్షరాలు ఎఫ్ఎస్ ఉంది. పదివేల నంబర్లు పూర్తయ్యాక మళ్లీ ఆ ఇంగ్లిష్ అక్షరాలు మారుతాయి. కొత్త సిరీస్ ప్రారంభమవుతుంది.
- టీఎస్09ఎఫ్ఎస్0001 నుంచి టీఎస్09ఎఫ్ఎస్9999 వరకు ఇదే సిరీస్ కొనసాగుతుంది. సిరీస్ పూర్తయ్యాక టీఎస్09ఎఫ్ అలాగే ఉండి, ఎస్‌కు బదులు ‘టీ’ (ఏబీసీడీ వరుస క్రమంలో) చేరుతుంది. అంటే టీఎస్09ఎఫ్టీ0001 నుంచి కొత్త సిరీస్ ప్రారంభమవుతుంది.
- ఇలాగే టీఎస్09ఎఫ్టీ9999 వరకు ఈ సిరీస్ కొనసాగి అనంతరం, టీఎస్09ఎఫ్యూ0001 సిరీస్ ప్రారంభమవుతుంది. ఇదే క్రమంలో టీఎస్09ఎఫ్యూ నుంచి జెడ్ వరకు సిరీస్ కొనసాగుతుంది. అనంతరం, సిరీస్ ఛేంజ్ అవుతుంది.
పూర్తి పారదర్శకంగా నంబర్ల కేటాయింపు
- ప్రతిరోజు నగరంలో వేల సంఖ్యలో వాహనాలు రిజిస్ట్రర్ అవుతుంటాయి.
- సంబంధిత ఆర్టీఏ జోన్ పరిధిలో ఉన్న వాహనాలకు ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న సిరీస్ కోడ్ ఆధారంగా నంబర్లు కేటాయించాల్సి ఉంటుంది.
- వాహన నంబర్లో మొదటి టీఎస్09, టీఎస్10, టీఎస్11, టీఎస్12లో ఎలాంటి మార్పు ఉండదు.
- వాటి తర్వాత వచ్చే ఇంగ్లిష్ అక్షరాలు, అంకెలు మారుతుంటాయి. నంబర్ల కేటాయింపు ఆన్లైన్ ద్వారానే ఉంది.
- ఎలాంటి నంబర్ దక్కించుకోవాలనుకున్నా ఆన్లైన్లోనే పోటీ పడాల్సి ఉంటుంది.
- పూర్తి పారదర్శకంగా నంబర్ కేటాయింపులు ఉంటాయి. -పి.దుర్గా ప్రసాద్, ప్రాంతీయ రవాణా శాఖాధికారి. ఖైరతాబాద్;
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

