వయోధికుల వ్యాక్సినేషన్‌కు ఉబర్ సేవలు

- రైడ్ చార్జీలను భరించనున్న హెల్పేజ్ ఇండియా
- క్యాబ్ బుక్ చేసి ఇంటికి పంపిస్తారు
- రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌లో సేవలు
- ఫస్ట్ డోస్, సెకెండ్ డోస్ పూర్తయ్యే వరకు వారిదే బాధ్యత
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వయోధికులకు హెల్పేజ్ ఇండి యా అండగా నిలవనున్నది. ఇంటి నుంచి ఆస్పత్రికి.. అక్క డి నుంచి తిరిగి ఇంటికి చేర్చే వరకు బాధ్యత తీసుకోనున్నది. రైడ్ బుక్ చేసి ఇంటికే క్యాబ్ పంపిస్తారు. ఈ మేరకు హెల్పేజ్ ఇండియా ఉబర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నది. అందుకు సంబంధించిన ఆమోదం లభించాక ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి డోస్, రెం డో డోస్ పూర్తయ్యే వరకు క్యాబ్ సర్వీస్ అందించనున్నది. అందుకు సంబంధించిన రైడ్ చార్జీలను హెల్పేజ్ ఇండియా భరిస్తుందని సంస్థ కో ఆర్డినేటర్ కళాధర్ తెలిపారు.
సేవలు ఇలా పొందొచ్చు..
టోల్ ఫ్రీ నంబర్-18001801253కు ఫోన్ చేసి సేవలను పొందొచ్చు. ఈ నంబర్లో హెల్పేజ్ ఇండియా సభ్యులు అందుబాటులోకి వస్తారు. వ్యాక్సినేషన్ తీసుకోవాలనుకునే వృద్ధులు తమ చిరునామాను, మొబైల్ నంబర్‌ను వారికి తెలియజేస్తే వారే క్యాబ్ బుక్ చేస్తారు. వ్యాక్సిన్ పూర్తయ్యాక మరొకసారి ఈ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలి. క్యాబ్ బుక్ చేసి సంబంధిత ఆస్పత్రికి పంపిస్తారు. అక్కడి నుంచి ఇంటికి చేర్చడంతో సేవలు ముగుస్తాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వివరించారు. కిలో మీటర్లతో సంబంధం లేదని.. వ్యాక్సినేషన్ ఎక్కడ తీసుకోవాలనుకున్నా చేర్చుతామని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

