కొండాపూర్, ఫిబ్రవరి 15 : కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్లో అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా 19 క్వార్టర్లను నిర్మించనున్నట్లు టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు. గురువారం బెటాలియన్ ఆవరణలో రూ.13 కోట్లతో చేపట్టిన క్వార్టర్ల నిర్మాణ పనులకు ఆమె.. తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ రమేశ్, డీఐజీ సిద్ధిఖీ, కమాండెంట్ సి.సన్నీతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బెటాలియన్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బెటాలియన్లో మరో 19 క్వార్టర్లను అన్ని సౌకర్యాలతో నిర్మించేందుకు రూ.13 కోట్లతో పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు
కె.సుబ్రహ్మణ్యం, డి. తులసీధర్, టి.ఈశ్వర్,
బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.