రూ.5 వేలకు కక్కుర్తి పడి.. ఏసీబీకి చిక్కారు

ఖైరతాబాద్, అక్టోబర్ 12: కొత్తగా ఇళ్లు కట్టుకుంటే కొందరు అధికారులు, సిబ్బందికి పండుగే. ఎలాంటి అనుమతులు కావాలన్నా లంచం తీసుకోవడం వారి నైజం. చిన్నపాటి ఇంటికి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేస్తే ఇద్దరు అధికారులు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. మంగళవారం రాత్రి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ జోన్ పరిధిలో మామిడి జ్ఞానేశ్వర్ తన ఇంటి మ్యుటేషన్ కోసం సర్కిల్ 12 మెహిదీపట్నం ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కౌళిక సురేశ్ కుమార్‌ను సంప్రదించాడు. అయితే సర్కిల్ కామటి, ఇన్చార్జి బిల్లు కలెక్టర్ పల్లెపాగా రాజేశ్వర్‌ను లంచం కోసం పురమాయించాడు. రూ.6వేలు ఇస్తేనే మ్యుటేషన్ చేయిస్తామని ఇద్దరూ హామీ ఇచ్చారు. దీంతో తాను అంత ఇచ్చుకోలేనని, రూ.5 వేలు మాత్రం ఇస్తానని చెప్పగా, సురేశ్ కుమార్, రాజేశ్వర్‌లు ఆ మొత్తాన్ని మంగళవారం సాయంత్రం ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో అందించాలని సూచించారు. కాగా, బాధితుడు ముందస్తుగా ఏసీబీ అధికారులను సంప్రదించగా, వారి సూచనల మేరకు డబ్బులు తీసుకొని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయంలోని సర్కిల్ 12 సెక్షన్లో వారికి అందజేస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురు ఇన్స్పెక్టర్లు, ఒక ఎస్సై పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- tsacb
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

