పార్టీ శ్రేణుల్లో.. ఫుల్ జోష్..!

- ప్లీనరీ సక్సెస్తో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం
- రేపు గ్రేటర్ అంతటా సన్నాహక సమావేశాలు
- వచ్చే నెల 15న వరంగల్ విజయ గర్జనకు సమాయత్తం
సిటీబ్యూరో, అక్టోబరు 25(నమస్తే తెలంగాణ): అధికార పార్టీలో నూతనోత్సాహం ఉరుకలేస్తోంది. హెచ్ఐసీసీ వేదికగా జరిగిన పార్టీ 20వ ప్లీనరీ విజయవంతం కావడంతో గ్రేటర్ గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్లీనరీలో అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఇదే జోష్తో మరింత చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.
పార్టీ అధినేతగా తొమ్మిదో సారి కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు, సీఎం కేసీఆర్ ప్రసంగంతో తమలో మరింత ఆత్మ విశ్వాసం పెరిగిందని, రాబోయే రోజుల్లో రెట్టింపైన ఉత్సాహంతో క్రియా శీలకంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 15న వరంగల్లో జరిగే పార్టీ విజయ గర్జనను విజయమే ధ్యేయంగా ముందడుగు వేయనున్నారు.
రేపు బుధవారం గ్రేటర్ అంతటా సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరిపి శ్రేణులను సన్నద్దం చేయనున్నారు. డివిజన్ల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి విజయగర్జనకు భారీగా తరలేలా సమాయత్తమవుతుండటం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

