Traffic restrictions | రేపటి నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic restrictions | సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు 6వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివెల్-2024 (International Kite Festival) సందర్భంగా పరడే గ్రౌండ్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ నేపధ్యంలో ఆ రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణాలు సాగించాలని సూచించారు.
పరిస్థితులను బట్టి తివోలి క్రాస్ రోడ్డు నుంచి ఫ్లాజా ఎక్స్ రోడ్డు వరకు రోడ్డును మూసేసి, ట్రాఫిక్‌ను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అలుగడ్డబావి ఎక్స్ రోడ్స్, సంగీత్ ఎక్స్ రోడ్స్, వైఎంసీఏ ఎక్స్ రోడ్స్, ప్యాట్నీ, ఎస్బీహెచ్, ఫ్లాజా, సీటీఓ, బ్రూక్ బాండ్, తివోలి, స్వీకార్ ఉపకార్ జంక్షన్స్, సికింద్రాబాద్ క్లబ్, తాడ్బన్ క్రాస్ రోడ్స్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయిన్పల్లి ఎక్స్ రోడ్స్, రసూల్‌పురా, బేగంపేట్, పారడైజ్ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు.
రైల్వే స్టేషన్, జూబ్లీ బస్‌స్టాండ్‌కు వచ్చిపోయే ప్రయాణికులు తమ ప్రయాణాలను సాఫీగా చేసే విధంగా ఫ్లాన్ చేసుకోవాలని సూచించారు. మెట్రో రైలు సర్వీస్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. గ్రౌండ్‌కు వచ్చే వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్కు చేయాలని వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
Ramgopal Varma | ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందా.. ఆర్జీవీ సంచలన పోస్టు..!
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

