ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad | ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. మరికాసేపట్లో ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్ తీరంలో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో
హైదరాబాద్ : ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. మరికాసేపట్లో ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్ తీరంలో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్, మింట్ కంపౌండ్ వైపు రాకపోకలను బంద్ చేశారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు కొనసాగనున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రేస్‌లు నెక్లెస్ రోటరీ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ఓల్డ్ సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కంపౌండ్ మీదుగా ఐమాక్స్ వరకు కొనసాగుతాయి.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా…
-వీవీ విగ్రహం(ఖైరతాబాద్) వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు. వీవీ విగ్రహం వద్ద షాదాన్ కాలేజ్, రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు.
-బుద్దభవన్, నల్లంపట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
-రసూల్‌పురా, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోటరీ వైపు నల్లగుట్ట మీదుగా వచ్చే వాహనాలను, నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
-ఇక్బాల్ మినార్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్ బండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ఫ్లై ఓవర్‌పై నుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి.
-ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు వెళ్లాలి.
-బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్మినార్, రవీంద్ర భారతి జంక్షన్‌కు మళ్లిస్తారు.
-ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్‌కంపౌండ్ వైపు వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
-ఖైరతాబాద్ బడా గణేష్ వైపు నుంచి ప్రింటింగ్ ప్రెస్, నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడా గణేష్ వద్ద రాజ్‌దూత్ లైన్లోకి మళ్లిస్తారు.
ఆర్టీసీ బస్సుల మళ్లింపు ఇలా..
అఫ్జల్‌గంజ్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, కట్టమైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్, బీబీఆర్ మిల్స్, కవాడిగూడ రూట్లలోకి మళ్లిస్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

