డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన లారీ.. రోడ్డుపై పడిపోయిన టమాటాలు
హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో టమాటాల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. శంషాబాద్ నుంచి గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది
బండ్లగూడ, జూన్ 17: హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో టమాటాల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. శంషాబాద్ నుంచి గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ బోల్తా కొట్టడంతో అందులో ఉన్న టమాటాలు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే డైరీ ఫార్మ్ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే టమాటాల లోడ్‌తో వెళ్తున్న రైతులు ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడం విశేషం. కాగా, ఈ ఘటనతో రహదారిపై చాలాసేపటి వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో లారీని పక్కకు తీశారు. అనంతరం రోడ్డుపై పడిన టమాటాలను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు.

Tomato Load1
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
బాల్య వివాహాల నిర్మూలనపై ఎంజీయూలో అవగాహన కార్యక్రమం
‘ఐలు 12వ నల్లగొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

