Cyber Crime | గృహిణిని బెదిరించి.. 40 లక్షలు కాజేశారు
‘మీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. మేం చెప్పినట్లు చేయకపోతే.. మహారాష్ట్ర మాజీ సీఎంకు సంబంధించిన ముఠాతో సంబంధాలున్నాయంటూ కేసులు నమోదు చేస్తాం’.. అంటూ ఓ గృహిణిని బెదిరించి..
Cyber Crime | సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ‘మీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. మేం చెప్పినట్లు చేయకపోతే.. మహారాష్ట్ర మాజీ సీఎంకు సంబంధించిన ముఠాతో సంబంధాలున్నాయంటూ కేసులు నమోదు చేస్తాం’.. అంటూ ఓ గృహిణిని బెదిరించి.. రూ. 40 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. సదరు మహిళకు తాము ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ మాట్లాడిన నేరస్తులు..
‘మీ పేరుతో ఉన్న పార్సిల్లో ఎండీఎంఏ డ్రగ్స్ ఉంది.. ముంబై పోలీసులకు కాల్ బదిలీ చేస్తున్నాం’ అని చెప్పారు. ఆ తర్వాత తాము ముంబై పోలీసులమని చెబుతూ.. ఓ ఫొటోను పంపించారు. అది మహారాష్ట్ర మాజీ సీఎం ఫొటో అని చెబుతూ.. ‘అతనికి ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. మీకు ఆ గ్యాంగ్‌లతో సంబంధముంది. అలాగే హత్య కేసుల్లోనూ సంబంధాలున్నాయి..
మీది, మీ కుటుంబ సభ్యులు, బంధువుల బ్యాంకు ఖాతాలు సీజ్ చేసి.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం’ అంటూ బెదిరించారు. కంగారుపడిన బాధితురాలు.. రూ. 40 లక్షలు రెండు దఫాలుగా సైబర్‌నేరగాళ్లు సూచించిన బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసింది. కాల్ కట్కాగానే ఇదంతా మోసమని గుర్తించి.. సైబర్ క్రైమ్ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి, సీసీఎస్ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

