అత్యాధునిక థీమ్ పార్కు.. థ్రిల్ సిటీ!

- పీవీ మార్గ్‌లో మరో పర్యాటకం
- ప్రపంచ స్థాయి గేమింగ్, పలు వినోద సౌకర్యాలతో ఏర్పాటు
- నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): మహా నగరంలోని చారిత్రాత్మక పీవీ మార్గ్‌లో మరో పర్యాటకం వచ్చి చేరనుంది. హైదరాబాద్ మహా నగరంలో అన్ని వయసుల వారిని ఆకట్టుకునే విధంగా నిర్మితమైన అత్యాధునిక థీమ్ పార్ థ్రిల్ సిటీని శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. ప్రపంచ స్థాయి గేమింగ్, వినోద సౌకర్యాలతో కూడిన ఆదర్శవంతమైన వినోద ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసినట్లు థ్రిల్ సిటీ డైరెక్టర్ ఎస్.రజనీకాంత్ తెలిపారు. పీవీ మార్గ్‌లోని పీవీ నరసింహారావు ఘాట్ పక్కన నిర్మించిన ఈ థీమ్ పార్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని అలరించే విధంగా ఇది నిర్మించబడిందని ఆయన వివరించారు. వివిధ సాహస క్రీడల (గేమింగ్)తో థ్రిల్ పొందే ఔత్సాహికులందరికీ ఈ థ్రిల్ సిటీ ప్రారంభం నిజంగా పర్యాటకులకు ఒక శుభవార్త అని డైరెక్టర్ రజనీకాంత్ అన్నారు. రైడింగ్ మాన్స్టర్ థియేటర్, స్ప్లాష్ కోస్టర్, ఫె్లైట్ సిమ్యులేటర్లు, సోడా కార్ డైవర్, ట్రైనింగ్ సిమ్యులేటర్, క్రికెట్ సిమ్యులేటర్, బౌలింగ్ అల్లే, బంపర్ కార్లు, ఫుట్‌బాల్, మ్యాజిక్ ట్రైన్, హార్స్ రంగులరాట్నం, ఇలా అనేక గేమింగ్ జోన్లతో పాటు వివిధ రకాల రుచికరమైన ఆహారం (ఫుడ్ కోర్ట్లు)లు కూడా నగర ప్రజలను మెప్పించే రీతిలో ఏర్పాటు చేసినట్టు వివరించారు. కరోనా మహమ్మారి కారణంగా సుదీర్ఘ సమయం ఇండ్లకే పరిమితమైన అనేక మంది హైదరాబాద్ నగర ప్రజలను కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్న అలాంటి వారు రోజంతా కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపేందుకు థ్రిల్ సిటీ ఒక వేదిక కానున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా రజనీకాంత్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

