దసరా ముహూర్తం దాటిపాయె
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రారంభం మరోసారి నీరుగారింది. అట్టహాసంగా ప్రకటనలు చేయడం, ఆ వెంటనే ముహూర్తాలు పెట్టడం.. ఆపై ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడకపోవడం ఈ ప్రాజెక్టులో సర్వసాధారణంగా మారింది. తాజాగా మూసీ తొలి దశ (ఫేజ్ -1) పనులకు దసరా పండుగ నాడే శంకుస్థాపన చేయాలని అన్ని ఏర్పాట్లు చేసింది.
- ఆచరణకు పడని అడుగులు..నిలిచిన కార్యక్రమం
- అసంపూర్తి డీపీఆర్‌లు.. నో సీఎం అపాయింట్మెంట్
సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) :మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రారంభం మరోసారి నీరుగారింది. అట్టహాసంగా ప్రకటనలు చేయడం, ఆ వెంటనే ముహూర్తాలు పెట్టడం.. ఆపై ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడకపోవడం ఈ ప్రాజెక్టులో సర్వసాధారణంగా మారింది. తాజాగా మూసీ తొలి దశ (ఫేజ్ -1) పనులకు దసరా పండుగ నాడే శంకుస్థాపన చేయాలని అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ముహూర్తం కాస్తా దాటిపోయింది. సీఎం అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడం, డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు పనులు చేపడుతున్నారే విమర్శలతో కీలక కార్యక్రమం నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
సర్కార్ ఫేజ్ -1 పనుల కోసం రూ.7,345.12 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి రూ.4,500 కోట్లు రుణం రూపంలో తీసుకోనున్నారు. రూ.2,845.12 కోట్లను హెచ్ఎండీఏ, టీజీఐఐసీ ద్వారా సమకూర్చాలని ప్లాన్ చేశారు. ఏడీబీ నుంచి రుణ మంజూరు ప్రక్రియ తుది దశలో ఉందని, డీపీఆర్ కూడా పూర్తి కాకపోవడంతో శంకుస్థాపన వాయిదా వేసినట్లుగా తెలిసింది.
ముందుకెళ్లని ప్రణాళికలు
ఫేజ్ -1 కింద ఈసాపై 9.2 కిలోమీటర్లు, మూసాపై 11.8 కిలోమీటర్ల మేర సుందరీకరణ, వ్యర్థాల తొలగింపు, ట్రంక్ లైన్ల నిర్మాణం, రోడ్లు, సైకిల్ ట్రాకుల ఏర్పాటు వంటి ఎన్నో ప్రణాళికల్లో ఉన్నాయని ఊరిస్తూనే ఉన్నారు. నాగోలు నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఫేజ్ -2 డీపీఆర్ పనులను కూడా వేగవంతం చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో పునాది రాయి పడకుండానే ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని అభిప్రాయం వెల్లువెత్తుతున్నాయి. కేవలం ప్రతిపాదనలు, అంచనాల పేరిట కాలయాపన చేస్తున్నారు. దీనికి అధికారులు రెండు నెలల కిందటే నిర్ణయించిన దసరా ముహూర్తమే ఉదాహరణగా నిలుస్తుందని పలువురు వ్యాఖ్యానించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- BRS
- hmda
- musi river
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

