ఫార్మాసిటీ చుట్టూ.. నూతన రోడ్లు
నగర శివారు ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తున్నది. కోర్ సిటీ నుంచి చుట్టూ 50 కి.మీ వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించి ఉన్నది.
- కందుకూరు, కడ్తాల్ మండలాల్లో.. రూ.6.29 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం
- ప్రతిపాదనలు సిద్ధం చేసిన హెచ్ఎండీఏ
సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ) : నగర శివారు ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తున్నది. కోర్ సిటీ నుంచి చుట్టూ 50 కి.మీ వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించి ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి మినహాయిస్తే మిగిలిన ప్రాంతమంతా హెచ్ఎండీఏ పరిధిలోనే ఉండటంతో.. ఆయా ప్రాంతాల్లో ప్రణాళికాబద్దంగా పట్టణీకరణ జరిగేలా చూడాల్సిన బాధ్యత హెచ్ఎండీఏపై ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నగర శివారులో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టు చుట్టూ ఉన్న మండలాలైన కడ్తాల్, కందుకూరు పరిధిలోని గ్రామాల్లో రకరకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
తాజాగా కందుకూరు మండలంలోని నేదునూర్ నుంచి కడ్తాల్ మండల పరిధిలోని రావిచేడు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ రోడ్డు నిర్మాణం కోసం సుమారు రూ.రూ.6.29 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్లను సైతం ఇటీవల అధికారులు పిలిచారు. ఈనెల 27వ తేదీలోగా టెండర్లకు గడువు ఇచ్చిన అధికారులు, మొత్తం రోడ్డు నిర్మాణాన్ని 3 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులే కాకుండా గ్రామాలను కలిపే రోడ్లు సైతం మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ నిధులతో చేపడుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

