ప్రసూతి దవాఖానలో అగ్ని ప్రమాదం
కోఠిలోని సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో దవాఖాన సూపరింటెండెంట్, సిబ్బంది స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి..
- వెంటనే స్పందించిన సూపరింటెండెంట్
- మంటలను ఆర్పిన అగ్ని మాపక శాఖ
సుల్తాన్‌బజార్, జూన్ 5: కోఠిలోని సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో దవాఖాన సూపరింటెండెంట్, సిబ్బంది స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. దవాఖాన ఆవరణలో విద్యుత్ దీపాల వెలుగుల కోసం టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు ఎంసీబీని ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి ఎంసీబీలోని వైర్లు షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయి.. మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన దవాఖాన సిబ్బంది మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేసి, కొంతమేరకు సఫలమయ్యారు. ఇదిలా ఉండగా.. ఎంసీబీ ఉన్న గది వెనుక భాగంలో లేబర్ రూం ఉండటంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. దీంతో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి అగ్నిమాపక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో హుటాహుటిన దవాఖానకు చేరుకొని మంటలను పూర్తి స్థాయిలో ఆర్పివేశారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి, సిబ్బంది చొరవను ప్రతి ఒక్కరూ అభినందించారు. ఇదిలా ఉండగా.. దవాఖాన పక్కనే ఉన్న విద్యుత్ శాఖ అధికారులకు సమాచారమిచ్చి.. దవాఖానలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, త్వరగా రావాలని ఆస్పత్రి సిబ్బంది కోరగా.. తమకు సంబంధం లేదని, దవాఖానకు చెందిన ఎలక్ట్రీషియన్‌ను పిలిపించుకోవాలని దురుసుగా సమాధానమివ్వడం గమన్హారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

