చలాన్లపై ఉన్న శ్రద్ధ.. ట్రాఫిక్‌పై ఏదీ?
మంగళవారం... ఉదయం 11 గంటలు.. నల్గొండ క్రాస్‌రోడ్డు నుంచి చాదర్‌ఘాట్ వరకు భారీగా ట్రాఫిక్ రద్దీ... మరో వైపు నల్గొండ క్రాస్‌రోడ్డులో వాహనాలకు చలాన్లు రాస్తూ ట్రాఫిక్ పోలీసులు... ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా.. ? ట్రాఫిక్ గాలికొదిలేసి చలాన్లపైనే పోలీసులు ఫోకస్ పెట్టడంపైనే వాహనదారులు మండిపడుతున్నారు.
- ఇదేం చిత్రమని వాహనదారుల ఆందోళన
మంగళవారం… ఉదయం 11 గంటలు.. నల్గొండ క్రాస్‌రోడ్డు నుంచి చాదర్‌ఘాట్ వరకు భారీగా ట్రాఫిక్ రద్దీ… మరో వైపు నల్గొండ క్రాస్‌రోడ్డులో వాహనాలకు చలాన్లు రాస్తూ ట్రాఫిక్ పోలీసులు… ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా.. ? ట్రాఫిక్ గాలికొదిలేసి చలాన్లపైనే పోలీసులు ఫోకస్ పెట్టడంపైనే వాహనదారులు మండిపడుతున్నారు. ఇది ఒక చోటనే కాదు.. నగరంతో పాటు శివారు ప్రాంతాలలో కొందరు ట్రాఫిక్ పోలీసులు ఇలానే వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ)
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యపై నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ జీవనదిలాంటిదని.. ఎప్పటికప్పుడు సాఫీగా సాగేలా చూడాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నగర ట్రాఫిక్‌పై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తూ అవసరమైతే లా అండ్ అర్డర్ పోలీసులను కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు రద్దీ సమయంలో వాడుకోవాలని చెప్పారు. అలాగే కొత్తగా ట్రాఫిక్‌లో హోంగార్డులను నియమించాలని సూచనలు చేశారు. రద్దీ సమయాలలో చలాన్లపై కాకుండా, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపైనే దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచనలు చేశారు. ఉన్నతాధికారులు అలా ఉంటే సిబ్బంది మాత్రం టాఫిక్ రద్దీతో సంబంధం లేకుండా చలాన్లపై దృష్టి పెడుతున్నారు. ఇది మలక్పేట్లోనే కాదు.. నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, నాంపల్లి వంటి రద్దీగా ఉండే ఇతర ప్రాంతాలలోను నడుస్తున్నది. ఇప్పటికైనా రద్దీ వేళల్లో క్షేత్ర స్థాయిలో విధి నిర్వహణలో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

