Weekly Bus Pass | హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక ‘వీక్లీ బస్ పాస్’తో అపరిమిత బస్ ప్రయాణం
Weekly Bus Pass | ప్రజా రవాణా వ్యవస్థ వినియోగాన్ని మరింత ప్రోత్సహించడమే కాకుండా, నగర ప్రయాణికులకు అందుబాటు ధరలలో మెరుగైన ప్రయాణ సేవలు అందించే దిశగా ప్రయాణికులకు ఆర్థిక భార తగ్గించడంతోపాటు సులభతరమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 'వీక్లీ బస్ పాస్' (Weekly Bus Pass) ను ప్రారంభించింది.
Weekly Bus Pass | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యం ప్రయాణించే ప్రయాణికులు, పర్యాటకులు, వ్యాపార పనుల నిమిత్తం నగరానికి వచ్చే వారి సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఒక సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులకు ఆర్థిక భార తగ్గించడంతోపాటు సులభతరమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో రూ.600 ధర కలిగిన ‘వీక్లీ బస్ పాస్’ (Weekly Bus Pass) ను ప్రారంభించింది. ఈ పాస్ కొనుగోలు చేసిన రోజు నుండి వరుసగా 7 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.
ఈ కొత్త వీక్లీ పాస్ ద్వారా ప్రయాణికులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏసీ (AC) బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించవచ్చు. అయితే కేవలం ‘పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్’ (Pushpak Airport Liner) సర్వీసులకు మాత్రం ఈ పాస్ వర్తించదని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోజువారీ పాస్ (Daily Pass), నెలవారీ పాస్ (Monthly Pass) సౌకర్యాలకు అదనంగా, ప్రయాణికులకు మరొక చవకైన, అనుకూలమైన ప్రయాణ ఎంపికను అందించడానికి టీజీఎస్ ఆర్టీసీ ఈ సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో స్వల్పకాలిక బస కోసం వచ్చే పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు, వారం రోజులపాటు నిరంతరం క్యూర్ పరిధిలో ప్రయాణించాల్సిన వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ వీక్లీ పాస్ వల్ల ప్రయాణికులు 7 రోజుల వ్యవధిలో చేసే ప్రతి ప్రయాణానికి వేర్వేరుగా టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి పాస్ తీసుకుంటే 7 రోజుల పాటు నగరంలో ఏ సిటీ బస్సులోనైనా (పుష్పక్ బస్సు మినహా) నిరభ్యంతరంగా, వేగంగా ప్రయాణించవచ్చు. ఈ వీక్లీ పాసులు నగరంలోని అన్ని సిటీ బస్ పాస్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. అవసరమైన వారు తమ సమీపంలోని బస్ పాస్ కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చని యాజమాన్యం వెల్లడించింది.
ప్రజా రవాణా వ్యవస్థ వినియోగాన్ని మరింత ప్రోత్సహించడమే కాకుండా, నగర ప్రయాణికులకు అందుబాటు ధరలలో మెరుగైన ప్రయాణ సేవలు అందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వీసీ, ఎండీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో వారం రోజులపాటు ప్రయాణించే వారందరూ ఈ రూ.600 వీక్లీ బస్ పాస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఎండీ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Read Also :
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weekly Bus Pass | హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక ‘వీక్లీ బస్ పాస్’తో అపరిమిత బస్ ప్రయాణం
Errabelli Dayakar Rao | ఎన్నికల్లో ఓటరు నమోదే కీలకం : ఎర్రబెల్లి దయాకర్ రావు
RC 17 | మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్.. ఆర్సీ 17 పూజా కార్యక్రమాలు ఎప్పుడంటే?
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

