టిఫా స్కానింగ్..అమ్మకు నో టెన్షన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది.
- సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖానలో అందుబాటులోకి
- ఆరు నెలల గర్భిణులకు విజయవంతంగా పరీక్షలు
- పిండం ఎదుగుదల, శారీరక లోపాలను గుర్తించేందుకు దోహదం
- ప్రైవేట్‌లో రూ. 6 వేలు.. ప్రభుత్వ దవాఖానలో ఉచితం
సుల్తాన్‌బజార్, జనవరి 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇప్పటికే గర్భిణులకు అవసరమయ్యే టిఫా, కలర్ డాప్లర్ యంత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రసూతి దవాఖానల్లో ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో రెండు యంత్రాలను ఏర్పాటు చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు.
కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకే..!
సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు ప్రతిరోజు సుమారు వంద మంది గర్భిణులు వస్తుంటారు. అందులో అవసరమైన సుమారు 40 నుంచి 50 మంది రోగులకు టీఫా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ టీఫా స్కానింగ్ పరీక్షలను కడుపులో పెరుగుతున్న బిడ్డకు అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా..? శారీరక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు చేస్తారు. ప్రైవేట్‌లో ఒక్కసారి ఈ పరీక్ష నిర్వహిస్తే సుమారు ఆరు వేలు ఖర్చు అవుతుందని, అలాంటిది ప్రసూతి దవాఖానలో ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

